కొత్త కళాశాలల ఏర్పాటుతో కల సాకారమైంది
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో కొత్త కళాశాలల ఏర్పాటుతో ఎన్నో రోజులు పాలమూరు విద్యార్థులు ఎదురుచూస్తున్న కల సాకారమైందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పీయూలో ప్రభుత్వం లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేసిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపి టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందిని కూడా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులతో పాటు తమందరి కృషి వల్ల యూనివర్సిటీకీ రూ.100 కోట్లు తీసుకురావడం సాధ్యమైందన్నారు. 2012లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో నిధులు లేకుండా కొట్టుమిట్టాడుతున్న యూనివర్సిటీకి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని తీసుకువచ్చి రూ.18 కోట్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. ఇక్కడికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను రప్పించి కార్యక్రమం నిర్వహించడంలో మంచి ఉద్దే శం ఉందని, ఇక్కడికి వచ్చిన విద్యార్థులలో కనీసం పదిశాతం మంది అయినా ఇక్కడ సీటు సాధించి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి తన చదువులు పూర్తయ్యేలోగా ఉపా ధి, ఉద్యోగ అవకాశాలతో పాటు స్టార్టప్‌లు ప్రారంభించేందుకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, రి జిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, వినోద్ పాల్గొన్నారు.
వీసీ జీఎన్ శ్రీనివాస్ మట్లాడుతూ పీయూలో ఇంజినీరింగ్ లా, కళాశాలలు ప్రారంభించేందుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment