విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించం
నారాయణపేట రూరల్: పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయి నిధులు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఏబీవీపీ సహించే ప్రసక్తే లేదని ఆ సంఘం జిల్లా కన్వీనర్ నరేష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అన్ని ప్రైవేటు కళాశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి సత్యనారాయణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు రూ.7800కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల్లోని పేద విద్యార్థులకు టీసీ, మెమోలు ఇవ్వడంలేదని, పై చదువులకు దరఖాస్తులు చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. మద్యం నిర్వహణకు మంత్రి ఉంచి.. విద్యాశాఖను ఎవరికీ కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యధిక నిధులు కేటాయించి విద్యార్థులు, ప్రజలను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంతియాజ్, వినయ్, చైత్ర, లక్ష్మణ్, చరణ్, వివేకానంద, వెంకటేష్, మౌలాలి, అభిరామ్, భరత్, క్రాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment