పేట ఆర్డీఓగా రాంచందర్
నారాయణపేట: పేట నూతన ఆర్డీఓగా రాంచందర్ గద్వాల నుంచి నారాయణపేటకు బదిలీపై వచ్చారు. బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 2022 నుంచి ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఈయన గద్వాలకు బదిలీపై వెళ్లారు.. తిరిగి గద్వాల నుంచి నారాయణపేటకు ఇటీవలే బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఓ వెంకటేష్, డిటి బాలరాజుతోపాటు ఆర్డీవో కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పత్తి క్వింటా
రూ.6,499
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి క్వింటాల్ గరిష్టంగా రూ.6,499, కనిష్టంగా రూ.6,179 లభించాయి. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,519, కనిష్టంగా రూ.1,449 , ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,061, హంస రకం రూ.1,741 ధరలు లభించాయి.
ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
వనపర్తి: ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రభువినయ్ కొంతకాలంగా కార్యాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారంటూ పొలిటికల్ జేఏసీ రాచాల యుగంధర్‌గౌడ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విధితమే. విచారణ చేపట్టిన అధికారులు అనధికారికంగా సెలవులు తీసుకున్న కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తూ బుధవారం ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్‌కు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
641.411 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోని దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. బుధవారం 9 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ సూరిబాబు తెలిపారు. ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 328.224 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 313.187 మి.యూ. ఉత్పత్తి సాధించామన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 641.411 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ఇందుకుగాను 18,466 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment