దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండేళ్ల పారామెడికల్ డిప్లొమా కోర్సులో డయాలసిస్ 30, ఈసీజీ 30 సీట్ల భర్తీ కోసం అర్హత, ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.రాంకిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తు నమూనాను సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఈ నెల 21వ తేదీలోగా పూర్తి వివరాలు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌తో స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.gmcnarayan pet.org, https:// narayanpet.telang ana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలనితెలిపారు.
వికలాంగుల పింఛన్‌రూ. 6 వేలు ఇవ్వాలి
నారాయణపేట: వికలాంగుల పింఛన్ రూ. 6వేలకు పెంచాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ. 6 వేలు, వృద్ధులు, వితంతులకు రూ. 4వేల పింఛన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ హామీని అమలుపర్చకుండా కాలయాపన చేస్తోందన్నారు. పింఛన్ పెంపు కోసం 44 లక్షల మంది, కొత్త పింఛన్ల మంజూరు కోసం 24.85 లక్షల మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వారికి రూ. 25వేల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి వచ్చేనెల 9వ తేదీ వరకు దశలవారీ పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.దశరథ్, కాశప్ప, బాబు, రంగయ్య మల్లేష్, నర్సప్ప బస్వరాజ్ ఉన్నారు.
సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ
నారాయణపేట: కర్ణాటక – తెలంగాణ సరిహద్దులోని జాలూల్‌పూర్ చెక్‌పోస్టులో మంగళవారం సీఐ శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు. సీఐ వెంట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా రగ్బీ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 21వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 విభాగం ఉమ్మడి జిల్లా బాలబాలికల రగ్బీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు పాఠశాల బోనఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం పీడీ నిరంజన్‌రావు 8919193768 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: మెదక్ జిల్లా మూసాయిపేటలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఎంపికను ఈనెల 21న మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కోచ్ సాధిక్ అలీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు జరుగుతాయని, మిగతా వివరాల కోసం 88973 78248 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment