అభివృద్ధికి బాటలు..!
నర్వ: దేశంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి బాట పట్టించేందుకు నీతి ఆయోగ్ జులై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో 500 వెనుకబడిన మండలాలను గుర్తించగా.. అందులో నర్వ మండలం ఆ జాబితాలో ఉంది. ఈ మండలం సమగ్ర అభివృద్ధి సాధించడం ద్వారా సంపూర్ణ ఉద్యమంగా మారాలని దృష్టిపెడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా గుర్తించబడిన నర్వ మండలాన్ని సంపూర్ణ అభియాన్ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సంస్థ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండలంలో ఇప్పటి వరకు జరిగిన, చేపట్టిన పనుల రివ్యూ కోసం గురువారం కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ రానున్నారు.
మోడల్ అంగన్‌వాడీకి చర్యలు
నర్వ మండలాన్ని అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా నీతి అయోగ్ సంస్థ సంపూర్ణ అభియాన్ కార్యక్రమానికి ఎంపిక చేసింది. జనవరి 7, 2023లో కార్యక్రమానికి ఎంపికై న మండలాల్లో మౌళిక వసతులు, లెర్నింగ్ స్కిల్స్ ఏర్పాటు కోసం అప్పటి కలెక్టర్ కోయ శ్రీహర్ష నర్వ మండలానికి రూ.4 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా మండలంలోని రాయికోడ్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్‌వాడీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. వాల్ పెయింటింగ్, గోడలపై చిత్రాలు, మ్యాప్‌లు, కిచెన్ గార్డెన్, ప్రీస్కూల్ కిట్స్, మంకీ బార్స్, బెడ్‌షీట్స్, ఈ పరికరాలను మండలంలోని 33 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు 6 జులై 2024 మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు, 19 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
‘సంపూర్ణ అభియాన్’తో నర్వకు మహర్ధశ
ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా మండలం ఎంపిక
నీతి ఆయోగ్ ద్వారా మండల అభివృద్ధికి చేయూత
ఆరోగ్యం, పోషణ, విద్య, మౌళిక వసతుల కల్పన
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రూ.9.40 కోట్ల రుణాలు
నేడు నర్వ మండలంలో కేంద్రమంత్రి పర్యటన
Comments
Please login to add a commentAdd a comment