లిక్కర్‌ కేసు: నేడు కవిత భర్తను విచారించనున్న ఈడీ | BRS MLC Kavitha In Second Day ED Custody Live Updates | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: నేడు కవిత భర్తను విచారించనున్న ఈడీ

Published Mon, Mar 18 2024 8:10 AM | Last Updated on Mon, Mar 18 2024 12:55 PM

BRS MLC Kavitha In Second Day ED Custody Live Updates - Sakshi

Live Updates..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 

గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది నేడు ఆన్‌లైన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. మహిళను అరెస్ట్‌ చేయకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు కవితకు ఏడు రోజులు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడీ అధికారులు కవితను విచారించారు. నేడు రెండో రోజు కూడా అధికారులు కవితను విచారించనున్నారు. 

అయితే.. విచారణ అనంతరం భర్త అనిల్, అన్న కేటీఆర్, న్యాయవాది ములాఖత్ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

తాజాగా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన కవిత. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని పిటిషన్‌ దాఖలు. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని పేర్కొన్న కవిత. పిటిషన్‌లో ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. 

ఢిల్లీ లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ప్రశ్నిస్తున్న ఈడీ

నేడు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించనున్న ఈడీ అధికారులు

ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కవితను విచారించనున్నారు. 

కవిత పాత్రకు సంబంధించి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన   అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి 

వాంగ్మూలంలో ఉన్న సమాచారాన్ని కవిత ద్వారా ధ్రువీకరించనున్న ఈడీ 

గత విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కవిత తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని ఈడీ ఆరోపణ  

ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు కుటుంబ సభ్యులను లాయర్లను కలుసుకునేందుకు అనుమతించిన కోర్టు.

ఇక నిన్న కవితను కేటీఆర్‌, హరీష్‌ రావు, బీఆర్‌ఎస్‌ నేతలు కలిసిన విషయం తెలిసిందే.  

రేపు కవిత పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement