కోల్‌కతా: అవినీతిపై ఉమ్మడిగా పోరాడదామని జీ 20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక తదితర నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకునే ఘరానా వ్యక్తుల ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. శనివారం కోల్‌కతాలో జరిగిన జీ 20 అవినీతి నిరోధక మంత్రుల స్థాయి భేటీని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అలాంటి నేరగాళ్లు విదేశాల్లో కూడబెట్టిన, పోగేసిన అక్రమాస్తులను, చేసిన అక్రమాలను సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నేరగాళ్లను వీలైనంత త్వరగా మాతృ దేశానికి అప్పగించడం కూడా సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతి వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోయేది నిరుపేదలేనని మోదీ ఆవేదన వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment