సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా పీడ పూర్తిగా తొలగిపోయే రోజులు వచ్చాయని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి విరుచుకుపడుతోంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాలలో తిరగడం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ ఉధృత రూపం దాలుస్తోందని వైద్యులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ వైరస్ చాలా వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందని, అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
తాజగా ఆదివారం దేశవ్యాప్తంగా కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 40,414 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత అయిదు నెలల్లో భారత్‌లో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దేశంలో నిన్న 291 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య1,61,843కు చేరింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలను దాటింది. ప్రస్తుతం 5,21,808 యాక్టివ్ కుసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644 ఇప్పటి వరకు 1,13,55,993 మంది కోలుకున్నారు.
చదవండి: అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది : యంగ్ హీరో
Comments
Please login to add a commentAdd a comment