ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగూతూనే ఉంది. గడిచిన గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కు పెరిగింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో కొత్తగా 848 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 58,390కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 24, 04, 585గా ఉంది. దేశంలో ప్రస్తుతం 7,04,348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3.5 కోట్ల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఒకే రోజు 9.25లక్షలకుపైగా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇందుకు టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment