గాంధీ చూపిన బాటలో నడవాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో మనమంతా నడవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్వో భుజంగ్ రావ్, ఏవో సూర్యా రావ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో...
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
ట్రిపుల్‌ఐటీలో..
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో గాంధీజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ మహాత్ముని మార్గంలో పయనించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్‌సాగీ, డా. రాములు, హరికృష్ణ, లక్ష్మణ్, ముత్యం, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
సబ్ జైలులో..
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సేషన్ జడ్జి రాధిక, న్యాయవాదులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
అహింస మహాత్ముడి ఆయుధం
నిర్మల్‌చైన్‌గేట్: అహింస మహాత్ముడి ఆయుధమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్‌తో పాటు భాగ్యనగర్ లోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు నందేడపు చిన్ను, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాజీద్ అహ్మద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment