వదంతులు నమ్మవద్దు
● ఎస్పీ జానకీ షర్మిల
భైంసాటౌన్: సామాజిక మాధ్యమాల్లో వచ్చే లేదా ఇతర వదంతులు ప్రజలు నమ్మవద్దని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కుభీర్ మండలానికి చెందిన ఓ యువకుడు, అదే మండలానికి చెందిన బాలిక భైంసా పట్టణానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ విషయమై స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే భైంసాకు చేరుకుని వివరాలు వెల్లడించారు. కుభీర్ ఘటన విషయమై పూర్తి వివరాలు సేకరించామని, ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు గుమిగూడవద్దన్నారు. ఏదైనా ఘటన జరిగితే పోలీసుల దృష్టికి తేవాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని కేసుల పాలు కావద్దని సూచించారు. ఆమె వెంట పట్టణ సీఐ గోపినాథ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment