స్థలం కోసం కలెక్టర్‌కు వినతి
నిర్మల్‌చైన్‌గేట్: దివ్యాంగుల సంఘ భవనానికి స్థలం కేటాయించాలని తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌కు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కలెక్టర్‌కు వారి సమస్యను విన్నవించారు. జిల్లాలోని అన్ని కుల సంఘాలకు భవనాలు ఉన్నాయని, దివ్యాంగుల సంఘానికి భవనం లేదని తెలిపారు. తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఉన్న స్థలంలో కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సట్టి సాయన్న, కె.ప్రవీణ్‌కుమార్, కె.భగవాన్, టి.ముత్యం, బి.రాజేశ్వర్, ఎస్.సత్యనారాయణ, ఈ.భూమేష్, జి.శ్రీనివాస్, ఎస్. చిన్నక్క, సౌమ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment