ఖానాపూర్: జిల్లాలో పెద్దపులి వేట కొనసాగిస్తోంది. మామడ అటవీ రేంజ్ పరిధిలోని పెంబి మండలం బుర్కలేగి గ్రామంలో సోమవారం ఎద్దును చంపిన పులి బుధవారం సాయంత్రం వరకు అదే కళేబరం తింటూ గడిపింది. గురువారం వేకువజామున 3 గంటల వరకు ఎద్దు కళేబరం తిటూ ఆకలి తీర్చుకుంది. అది అయిపోవడంతో తిరిగి వేటకు బయల్దేరింది. గురువారం మధ్యాహ్నం మామడ మండలం దిమ్మదుర్తి అటవీ రేంజ్ పరిధిలోని ఖానాపూర్ మండలం బావాపూర్(ఆర్) తండా శివారు అటవీ ప్రాంతంలో పశువుల మందపై పంజా విసిరింది. ఈ విషయం మండల ప్రజలకు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. పులి సంరక్షణ చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పశువుల కాపరులు, రైతులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని దిమ్మదుర్తి, ఖానాపూర్, మామడ ఎఫ్‌ఆర్‌వోలు శ్రీనివాస్‌రావు, కిరణ్, అవినాస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment