ఎంఈవోల విధులు ఇలా... | - | Sakshi
Sakshi News home page

ఎంఈవోల విధులు ఇలా...

Published Fri, Nov 15 2024 1:18 AM | Last Updated on Fri, Nov 15 2024 1:18 AM

-

● మండల విద్యాధికారులు ప్రతీరోజు కనీసం రెండు పాఠశాలలను సందర్శించి తనిఖీ చేయాలి. పాఠశాలలో సమకూరిన వసతులపై ఆరా తీసి అవసరమైన వాటిని ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు చేపట్టాలి.

● మండల స్థాయిలో సర్వీస్‌ బుక్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశ పాఠశాల కమిటీలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశాలు విద్యాప్రమాణాలు పెంచే చర్యలకు మార్గ నిర్దేశం చేయాలి.

● మధ్యాహ్న భోజనం రుచి, శుచితో విద్యార్థులకు అందించేలా పర్యవేక్షణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్కుల పంపిణీ అమలుతీరును పర్యవేక్షించాలి.

● విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించే చర్యలను చేపట్టేందుకు మార్గనిర్దేశం చేయాలి. డ్రాపౌట్స్‌ కూడా తగ్గించేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలి.

● మండల పరిధిలోని పాఠశాలల స్థితిగతులపై నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయాలి. ఉపాధ్యాయుల హాజరు, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేలా పర్యవేక్షించాలి.

● ప్రతీ సంవత్సరం అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులకు, సీఆర్పీలకు తర్ఫీదు ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement