ఆలయ భూములు ఆక్రమిస్తే చర్యలు
భైంసాటౌన్: ఆలయ భూములను కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని ఆ శాఖ నిజామాబా ద్ సహాయ కమిషనర్ విజయరామారావు హె చ్చరించారు. పట్టణంలోని భైంసా–బాసర మా ర్గంలోని 435, 468 సర్వే నంబర్లలోని దేవాదా య శాఖ భూముల్లో కబ్జాలను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పట్టణంలోని సర్వే నంబర్ 435లో శ్రీ వేంకటేశ్వర ఆలయానికి చెందిన 4.14 ఎకరా లు, అలాగే సర్వేనంబర్ 468లో నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని శ్రీవేంకటేశ్వర ఆలయానికి చెందిన 5.19 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ మేరకు పరిశీలించి ఆక్రమణలను గుర్తించామన్నారు. కబ్జాలు తొలగించాలని నోటీసులు జారీ చేస్తామని, ఎలాంటి క్రయవిక్రయాలు జరుపవద్దని హెచ్చరించారు. ఆయన వెంట ఈవో వేణు, ఇన్‌స్పెక్టర్ కమల ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment