నాటు వేయాలా.. వద్దా?
● డీ–19 కాలువకు అందని నీళ్లు●
● సందిగ్ధంలో బాబాపూర్ రైతులు
లక్ష్మణచాంద: మండల ప్రజలకు వరప్రదాయినిగా సరస్వతి కాలువను పేర్కొంటారు. దీనికి ఉప కా లువగా ఉన్న డీ–19 కింద మండలంలోని బా బాపూర్ గ్రామానికి చెందిన రైతులకు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. సరస్వతి కాలువకు రెండో పంటకు నీరు వస్తుందనడంతో వారంతా సంతోషంగా వరి నార్లు పోసుకున్నారు. ప్రస్తుతం నార్లు నాటు దశకు ఎదిగాయి. కానీ.. వారంరోజులుగా కనకాపూర్ వాగు ద్వారా సరస్వతి కాలువ నీటిని సదర్‌మాట్‌కు వదులుతుండగా డీ–19 కాలువకు నీళ్లు రావడం లేదు. దీంతో వరి నాట్లు ఎలా వేయాలి? అని బాబాపూర్ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే మరో రెండు, మూడు రోజులు కాలువ నీళ్లు రాకుంటే వరి నార్లు ఎండిపోయే ప్ర మాదముందని తెలిపారు. దీంతో తాము నష్టపోక తప్పదని వాపోతున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ మధుకర్‌ను సంప్రదించగా.. వారం కిందటి వరకు 15రోజుల దాకా మండల రైతులకు సాగునీరిచ్చామని తెలిపారు. ఉన్నతాధికారుల సూచన మేరకు సదర్‌మాట్‌కు వారం రోజులు వాగు ద్వారా నీరు వదులుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 24నుంచి మండల రైతులకు సరస్వతి కాలువ నీరు వస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.
బాబాపూర్ వద్ద బీడుగా మారిన భూమిలో రైతులు
Comments
Please login to add a commentAdd a comment