దుకాణాలపై అధికారుల దాడులు
నిర్మల్‌టౌన్/సోన్ : ‘బాల్యం బందీ’ శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని వివిధ దుకా ణాలపై ఆపరేషన్ స్మైల్ అధికారులు, సిబ్బంది దాడులు ప్రారంభించారు. నిర్మల్ రూరల్ మండలం డ్యంగాపూర్, విశ్వనాథ్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గొర్రెల కాపరిగా పనిచేస్తున్న తొమ్మిదేళ్ల బాలుడిని గుర్తించారు. అతడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచారు. పనిలో పెట్టుకున్న సిద్దులకుంట గ్రామానికి చెందిన నిఖిల్‌పై కేసు నమోదు చే శారు. తండ్రితో పాటు గొర్రెలు కాస్తున్న మరో బాలుడి కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బా లలను పనిలో పెట్టుకుంటే కఠి న చర్యలు తప్పవని జిల్లా బాలల పరిరక్షణ అ ధికారి దేవి మురళి ఈ సందర్భంగా హెచ్చరించారు. బాలలను పనిలో పెట్టుకున్నట్లు ఎవరికై నా సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098కు తెలుపాలని సూచించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ వహీద్, ఆపరేషన్ స్మైల్ ఎస్సై నరేశ్‌కుమార్, సాదిక్, హెడ్ కానిస్టేబుల్ జమీర్, సిబ్బంది శ్రీనివాస్, లక్ష్మణ్, హారిక, లేబర్ డిపార్ట్‌మెంట్ జూనియర్ అసిస్టెంట్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మికుడి గుర్తింపు
యజమానిపై కేసు నమోదు
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
Comments
Please login to add a commentAdd a comment