ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదే శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 3వ తేదీ నుంచి నోటిఫికేషన్ అమలులోకి వస్తుందన్నారు. 10వ తేదీ వర కు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీ లన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉద యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్ని కలు నిర్వహించనున్నట్లు వివరించారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోడ్ అమలులో ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్టీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment