ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఉద్యోగులే...
నిర్మల్‌ఖిల్లా: ప్రజలకు ప్రభుత్వానికి ఉద్యోగులు వారధి లాంటివారని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూత న సంవత్సర క్యాలెండర్, డైరీలను శనివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని స్పష్టం చేశారు. సుపరిపాలన అందించడంలో భాగంగా ప్రణాళిక బద్ధంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజీ.రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాత్రిక రమేశ్, అసోసియేట్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, సత్యపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గంగాధరయ్య, ప్రచార కార్యదర్శి విష్ణువర్ధన్, జాయింట్ సెక్రెటరీ రాణి, కార్యవర్గ సభ్యులు రాజమల్లు, క్రాంతికుమార్, శ్రీనివాస్‌గౌడ్, కిరణ్, కరుణశ్రీ, మధుకర్, శ్రీహరి, లత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
Comments
Please login to add a commentAdd a comment