ఫిర్యాదులు పరిష్కరించాలి
భైంసాటౌన్: ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పాత రూరల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పది మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నిర్మల్ పోలీస్.. మీ పోలీస్’లో భాగంగా జిల్లాలో ప్రజలకు పోలీసు సేవలను చేరువ చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతీ బుధవారం భైంసా డివిజన్ పరిధిలో ఫిర్యాదుదారుల అర్జీల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు నిర్భయంగా, నేరుగా తనను కలిసి అర్జీలు అందజేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment