ఫౌండేషన్ సేవలు అభినందనీయం
నర్సాపూర్ (జి): సమత ఫౌండేషన్ సేవలు అభినందనీయమని రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి పేర్కొన్నారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో బుధవారం సమత ఫౌండేషన్ క్యాంపు కా ర్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సమత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సమత సుదర్శన్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నిరుపేదలు, అనాథలు, అభాగ్యులకు అండగా సమత ఫౌండేషన్ నిలుస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. నర్సాపూ ర్ (జి) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని నిర్మల్ జిల్లాలో సమత ఫౌండేషన్ సేవలు విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చా ర్జి ఆత్రం సుగుణ, ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు నా రాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పాటిల్, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి, నాయకులు భోజరాం పటేల్, కొత్తపల్లి బుచ్చన్న, గజానంద్, చంద్రకాంత్‌యాదవ్, శంకర్ చంద్రే, కొండ్ర రమేశ్, గంగారాం, సమత ఫౌండేషన్ ఆర్గనైజర్ సాహెబ్‌రావు, సీఈవో అనిల్‌కుమార్, పీఆర్వో క్రాంతికుమార్, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment