హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన
లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వి ఫలమైందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆ రోపించారు. బుధవారం మండలంలోని కనకా పూర్‌లోసీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. వ డ్యాల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ, మూత్రశాలల నిర్మాణ పనులకు శంకుస్థాపన చే శారు. రాచాపూర్‌లో ముదిరాజ్ సంఘ భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశా రు. మండల కేంద్రంలో రూ.5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ.5లక్షలతో చేపట్టిన అంబేద్కర్ భ వన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చా మన్‌పెల్లి, చింతల్‌చాంద, పార్‌పెల్లి, ధర్మారం, పీచర గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. పొట్టపెల్లి (కే) గ్రామంలో చేపట్టిన దుర్గామాత షెడ్డు నిర్మాణానికి మంజూరైన రూ.2.05లక్షల ప్రొసీడింగ్‌ను గ్రామస్తులకు అందజేశారు. మండల కేంద్రానికి చెందిన కానుగంటి శంకర్‌కు చికిత్స కోసం మంజూరైన రూ.2లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రూ.4 కోట్లతో మండల కేంద్రం నుంచి సోన్‌కు వెళ్లే రో డ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మండల కేంద్రం నుంచి వైకుంఠధామం వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణా నికి రూ.80 లక్షలు మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రతీ మారుమూల గ్రామానికీ రో డ్డు, తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. నాయకులు రావుల రాంనాథ్, అడ్వాల రమేశ్, ముత్యంరెడ్డి, భూపాల్‌రెడ్డి, చిన్నయ్య, వోస రా జు, సురేశ్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment