భద్రత నియమాలు పాటించాలి
నిర్మల్‌టౌన్: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆర్టీవో దుర్గాప్రసాద్ సూచించారు. జిల్లా కేంద్రంలోని లారీ అసోసియేషన్ వద్ద ఓనర్లు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ.. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఎక్కువ శాతం అతివేగంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంవీఐలు మహేందర్, మూర్తూజా అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాదాలను నివారించాలి
సారంగపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్ సూచించారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు సమీపంలో బుధవారం ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనచోదకులంతా తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ప్రతీ వాహనానికి తప్పకుండా అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలు ఉండాలని తెలిపారు. చాలామంది వాహనచోదకులు బాధ్యతారాహిత్యంతో వాహనాలు నడుపుతుండగా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వాహనచోదకులు రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్‌స్టేషన్ అధికారి శివాజీ, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment