ఫిట్స్‌తో ఇటుకబట్టి కూలీ మృతి | Sakshi
Sakshi News home page

ఫిట్స్‌తో ఇటుకబట్టి కూలీ మృతి

Published Sun, Apr 7 2024 1:40 AM

-

మాచారెడ్డి: ఫిట్స్‌తో ఇటుక బట్టి కూలీ మృతి చెందిన సంఘటన శనివారం మాచారెడ్డిలో చోటుచేసుకొంది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లాకు చెందిన అడవ్‌ గజానన్‌(32) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. శనివారం ఉద యం గంభీరావుపేట నుంచి మహారాష్ట్రకు బయల్దే రి కాకుల గుట్ట తండా స్కూల్‌ వెనకాల ఫిట్స్‌ వచ్చి పడిపోయి మరణించాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి క్రైం: ఎండ తీవ్రత నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్యశాఖాధికారి వరదారెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. చెరువులు, కుంటల నీటిలో వేడి పెరిగి చేప లు మృత్యువాత పడే అవకాశాలు ఉంటాయని పే ర్కొన్నారు. మత్స్యకారులు వీలైనంత త్వరగా చేపలు పట్టి విక్రయించుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement