నిజాయితీకీ మారుపేరు బీజేపీ | Sakshi
Sakshi News home page

నిజాయితీకీ మారుపేరు బీజేపీ

Published Tue, May 7 2024 11:00 AM

నిజాయితీకీ మారుపేరు బీజేపీ

నిజామాబాద్‌రూరల్‌: ప్రజలందరూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి నిజాయితీకి మారుపేరైన బీజేపీని గెలిపించాలని నిజామాబాద్‌ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. మండలంలోని గుండారం గ్రామంలో సోమవారం ఆ యన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రె స్‌ పార్టీ చేపట్టిన ఆరు గ్యారంటీలు ఉత్తవేనని, సంవత్సరం తరువాత ఆ పార్టీ కనుమరుగైపోతుందని జోస్యం చెప్పారు. హైదవ సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత ప్రధానమంత్రి మో దీకే చెందుతుందన్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు వారి తల్లిదండ్రులకు ఈనెల 13న కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి ప్రధాని మోదీని బలపర్చా లని కోరారు. తాను ఐదు సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడిగా పేరుపొందానని, సేవా కార్యక్రమా లు చేయడానికే బీజేపీ నాయకులు రాజకీయాల్లోకి వస్తారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినే ష్‌, అసెంబ్లీ కన్వీనర్‌ పద్మరెడ్డి, జగన్‌, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండబోదని, త్వరలో నే కూలిపోవడం ఖాయమని ఎంపీ, బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి పేర్కొన్నారు. మోపాల్‌ మండలకేంద్రంలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన కా ర్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. దేశం, ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోదీ 18 గంటలు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తెలిపారు. రేషన్‌కార్డులు లేనివారికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మూడు నెలల్లో కొత్త కార్డులు ఇప్పిస్తామని హామీనిచ్చారు. చెరుకు ఫ్యాక్టరీలను పునరుద్ధరి స్తామని, వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్ఫ్‌ కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని, రైల్వేలైన్లు పెంచుతామని, ఇవన్నీ జరగాలంటే మూడోసారి కేంద్రంలో మోదీ ప్రధాని కావాలన్నారు. ప్రజలందరూ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, ద్యాప రవి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, శశాంక్‌రెడ్డి, నరేందర్‌, బాలు నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు ఉత్తవే

ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

Advertisement
 
Advertisement