పేదలను ఆదుకోవడానికే సమగ్ర సర్వే
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే నిరుపేదలను ఆదుకునేదందుకేనని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఆదివారం ఆయన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఎంపీడీవో సుబ్రమణ్యం, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిర్మన్ పల్లి నుంచి పాల్ధా రోడ్డు, గ్రామంలో మహిళ భవన్‌తో పాటు నూతనంగా ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణనికి నిధులు మంజురు అయ్యేవిధంగా చర్యలు చేపడతానన్నారు. అంతకుముందు గ్రామంలో సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ కంటి వైద్య వాహనాన్ని ప్రాంభించారు. సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ గడీల శ్రీరాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలికెట్ బాడ్సీ శేఖర్ గౌడ్, కార్పొరేటర్ కోర్వ లలిత, గంగాధర్, కాంగ్రెస్ నాయకులు బాగిర్తి బాగరెడ్డి, అగ్గు భోజన్న, గుండారం, పాల్ధా సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్, కౌలాస్ శ్రీనివాస్, కోర్వ రాజేంద్ర ప్రసాద్, మోహన్ తదితరులు పాలొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
జలాల్‌పూర్‌లో సర్వే పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment