గోదావరికి పోటెత్తిన భక్తులు
రెంజల్(బోధన్)/బాల్కొండ: రెంజల్ కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. కార్తీకమాసం కావడంతో నదీ స్నానాలను ఆచరించడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పిండి వంటలు, నైవేద్యాలు చేసుకుని తెప్పలు వదిలారు. ఒడ్డున గల పుష్కరరాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు సత్యనారాయణ వ్రతాలు చేశారు. అలాగే బాల్కొండ మండలంలోని పోచంపాడ్ వద్దగల గోదావరిలో స్నానా లు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment