రూ.1.05 కోట్ల విలువైన గంజాయి కాల్చివేత
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ గ్రామ శివారులో గల శ్రీ మెడికేర్ సర్వీ సెస్‌లో సోమవారం రూ.1.05 కోట్ల విలువైన ఎండు గంజాయిని అధికారులు దహ నం చేశారు. ఆర్మూర్, భీమ్‌గల్, నిజామాబాద్, మోర్తాడ్ ఎకై ్సజ్ స్టేషన్‌ల పరిధిలలో దొరికిన 353 కిలోల గంజాయి, 1.5 కిలోల డైజోఫాం, 2.5 కేజీల అల్ప్రాజోలం కాల్చి వేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి మల్లారెడ్డి పర్యవేక్షణలో వాటిని దహనం చేశారు. ఆర్మూర్, మోర్తాడ్, నిజామాబాద్, భీమ్‌గల్ ఎస్‌హెచ్‌వోలు స్టీవెన్‌సన్, గుండప్ప, దిలీప్, వేణుమాదవరావు, వివిధ స్టేషన్‌ల సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు బోనస్
అందిస్తున్న ప్రభుత్వం
ఆర్మూర్: సన్న రకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తున్నట్లు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌లోని విత్తన అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడా రు. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేస్తు వస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి చేస్తు న్న అభివృద్ధి చూసి బీఆర్‌ఎస్, బీజేపీ నాయ కులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరో రెండు నెలల్లో పసుపు పంట చేతికి వస్తుందని, పసుపు బోర్డు ఊసేలేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.
విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా కార్యవర్గం
కామారెడ్డి అర్బన్: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జాయింట్ కమిటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంగల స్వామి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కమిటీ ఉమ్మడి జిల్లా చైర్మన్‌గా ప్రణీత్‌గౌడ్, కన్వీనర్‌గా శ్రీకాంత్‌యాదవ్, కోకన్వీనర్లుగా అశ్విన్, తిరుపతిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా శివానంద్, కోశాధికారిగా స్వామి, సోషల్ మీడియా కన్వీనర్‌గా ప్రసాద్‌గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్వామి మాట్లాడుతూ 15 ఏళ్లుగా వెట్టిచాకిరికి గురవుతున్న ఆర్టిజన్ల మనోభావాలను దెబ్బతీసేలా విద్యుత్ యూనియన్ల నాయకులు కొందరు మాట్లాడడం సరికాదన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.
నేడు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
నిజామాబాద్‌నాగారం: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు నూతన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్‌రావు తెలిపారు. నాందేవ్‌వాడలోని అసోసియేసన్ కా ర్యాలయంలో సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న నాలు గు డీఏలు విడుదల చేయాలని, నగ దు రహిత వైద్యం అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆ స్పత్రుల్లో అనుమతించాలన్నారు. పీఆర్‌సీని 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చే యాలని, కమిటీషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీ ర్పును అమలు చేయాలన్నారు. వెల్‌నెస్ సెంటర్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు హన్మాండ్లు, కార్యదర్శి ప్రసాద్‌రావు, గౌరవ అధ్యక్షుడు దత్తాత్రేయరావు, జిల్లా నాయకులు బాబాగౌడ్, లావు వీర య్య, భోజారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment