నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో ప్రజా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు ప్రజా కళాయా త్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో కళాయాత్ర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కళాయాత్ర ప్రతినిధులు రాష్ట్రమంతా పర్యటిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో 20న అంతడుపుల నాగరాజు బృందం విజ యోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీపీఆర్‌వో పద్మశ్రీ, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్ ఉమే ష్ చంద్ర, బీసీ సంక్షేమ అధికారి స్రవంతి, ఏసీపీ రవీందర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీఈవో అశోక్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, యువజన క్రీడల అధికారి ముత్తెన్న పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అంకిత్
Comments
Please login to add a commentAdd a comment