మోర్తాడ్(బాల్కొండ)/నిజామాబాద్ అర్బన్ : సమగ్ర సర్వే గడువు మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఎన్యుమరేటర్లు, పరిశీలకులకు మౌఖిక ఆదేశాలు అందాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారంతోనే సర్వే ముగించాల్సి ఉంది. ఈ నెల 6న సర్వే ఆరంభం కాగా మొదట్లో ఒక్కో కుటుంబం వివరాల నమోదుకు ఎక్కువ సమయం పట్టింది. రోజుకు ఒక ఎన్యుమరేటర్ 20 కుటుంబాల వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు. ఆశించిన సమయంలో వివరాల నమోదు కాకపోవడంతో సర్వే గడువు పెంచుతారని ప్రచారం జరిగింది. 15 రోజుల పాటు సమగ్ర సర్వేలో వివరాలను నమోదు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150 నుంచి 170 ఇళ్లను సందర్శించి వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే వివరాలు నమోద చేయడానికి ఎక్కు సమయం పట్టడంతో గడువు ముగిసే నాటికి ఇంకా ఇళ్లు మిగిలిపోయాయి. మంగళ, బుధవారాల్లో మిగిలిపోయిన కుటుంబాల సమాచారం సేకరించాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. సర్వేకు గడువు పెంచడంతో ఎన్యుమరేటర్లకు ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది. ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తి కాగా మరో 20 శాతం వివరాల నమోదు రెండు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది.
నమోదు పూర్తి కాని
కుటుంబాల వివరాలు
గడువు పెంచుతూ అధికారుల
ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment