ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయిని కలెక్టర్ సంకేత్ కుమార్, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
బకాయిలు వెంటనే చెల్లించండి
పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు సంబంధించిన రూ.175 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, కుల వివక్ష పోరాట సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
నాణ్యమైన విద్య అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేవిధంగా చూడాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ కోరారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment