మేయర్ భర్తపై దాడి
ఖలీల్‌వాడి: నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ దండు చంద్రశేఖర్ అలియాస్ శేఖర్‌పై దాడి జరిగింది. సోమవారం సాయంత్రం పదో డివిజన్‌లోని ఓ వా టర్ ప్లాంట్ వద్ద 80 క్వార్టర్స్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ రసూల్ అలియాస్ శుక్రు దాడి చేశాడు. నడుచుకుంటూ వచ్చిన రసూల్ దగ్గరికి రాగానే దా డి చేశాడు. దీంతో శేఖర్ కింద పడిపోయాడు. పక్క నే ఉన్న వారు అడ్డుకోడానికి యత్నించగా రసూల్ బెదిరించాడు. అనంతరం ఆటోలో నుంచి సుత్తి తీసుకొని వచ్చి దానితో కొట్టాడు. గాయపడ్డ శేఖర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
దాడి వీడియో వైరల్
దాడి చేయడానికి రసూల్ ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. దాడి చేయడానికి వెళ్లే సమయంలో వీడియో తీసేందుకు వ్యక్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. దండు శేఖర్ అనుచరులు భూ వివాదంలో ఇబ్బందులకు గు రి చేయడంతో దాడికి పాల్పడ్డారనే అభిప్రాయాలు ఉన్నాయి. మేయర్ భ ర్త శేఖర్‌పై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికంగా వంద గజాల ప్లాట్ వివాదంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.
డబ్బులు డిమాండ్ చేయడంతో..
దాడి అనంతరం నిందితుడు రసూల్ వీడియో విడుదల చేశాడు. దండు శేఖర్ అ నుచరులు గోపాల్ తోపాటు మరి కొంత మంది తన భూమి కబ్జా చేశారని పేర్కొన్నాడు. మూడేళ్ల నుంచి వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రూ.రెండు లక్షల డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించాడు. ఎన్నో సార్లు శేఖర్‌ను కలిసి తన భూమి అప్పగించాలని అడిగినా ఆయన ఒప్పుకోకపోవడంతో దాడి చేశానని చెప్పారు. గత 15 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు సాయం చేయాలని కోరాడు.
ఆస్పత్రికి వచ్చిన అనుచరులు
శేఖర్‌పై దాడి విషయం తెలియడంతో ఆయన అనుచరులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆస్పత్రికి తరలి వచ్చారు. శేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. భారీ స్థాయిలో కార్యకర్తలు రావడంతో హాస్పిటల్ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
గోపాల్‌పై గతంలో కేసు
నగరంలోని నాగారం ప్రాంతంలోని శిఖం భూమి కబ్జా చేసి ఇంటి స్థలాలు విక్రయించిన కేసులో గోపాల్ ఏ2గా ఉన్నారు. రసూల్ తన ఇంటి స్థలాన్ని దండు శేఖర్ అనుచరుడు గోపాల్‌తోపాటు మరి కొంత మంది కబ్జా చేశారని వీడియో విడుదల చేయడంతో నగరంలో చర్చ జరుగుతోంది. కాగా గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. రసూల్‌తో తనకు భూ వివాదం లేదన్నారు. భూ వివాదం ఉంటే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కావాలని తనపై ఆరోపణలు చేశాడన్నారు. శేఖర్‌పై దాడి వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తీవ్రంగా గాయపడ్డ దండు చంద్రశేఖర్
ఆస్పత్రికి తరలించిన స్థానికులు
తన భూమి కబ్జా చేయడంతోనే దాడి చేశానన్న నిందితుడు
వీడియో విడుదల
నాలుగు బృందాలతో గాలిస్తున్నాం
ఖలీల్‌వాడి: మేయర్ భర్త దండు శేఖర్‌పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. భూ వివాదం నేపథ్యంలో రసూల్ దాడి చేశాడని చెప్పారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. దాడి వెనుక ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తను, సహకరించాలని వీడియో రిలీజ్ చేయడంపై విలేకరులు అడగ్గా అలాంటిది ఏమి లేదని ఏసీపీ చెప్పారు. నిందితుడు ఆటో డ్రైవర్‌గా, బౌన్సర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. శేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment