ఒకరి అదృశ్యం
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన తిమ్మపురం సాయిలు(40) కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో గురువారం అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. సాయిలు కొంతకాలంగా తన భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. నాలుగు నెలల క్రితం ఫిట్స్ రావడంతో అతను తన ఇంటికి వచ్చేశాడు. నెలరోజుల క్రితం తిరిగి హైదరాబాద్‌లో పని చేసుకుంటానని తల్లి మాణెమ్మకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. సాయిలు వద్ద ఫోన్ లేకపోవడంతో అతని తల్లి మాణెమ్మ హైదరాబాద్‌లోని కోడలికి ఫోన్ చేసి అడగ్గా హైదరాబాద్‌కు రాలేదని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. దీంతో గురువారం ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సదాశివనగర్‌లో యువతి..
సదాశివనగర్: సదాశివనగర్‌కు చెందిన ఓ యువతి (25) గురువారం అదృశ్యమైనట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. ఆమె ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment