భూ వివాదాలు @ నాగారం | - | Sakshi
Sakshi News home page

భూ వివాదాలు @ నాగారం

Published Sat, Nov 23 2024 1:01 AM | Last Updated on Sat, Nov 23 2024 1:01 AM

భూ వివాదాలు @ నాగారం

భూ వివాదాలు @ నాగారం

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని నాగారం భూ వివా దాలకు కేంద్ర బిందువుగా మారింది. నాగారంలో ఎక్కువగా ప్రభుత్వ ఉండటంతో గతంలో ప్రభు త్వం పేదలకు 70 నుంచి 85 గజాల ఇంటి స్థలాలను అందజేసింది. దీనిని ఆసరా చేసుకున్న ముఠా లు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నకిలీ పట్టా లు సృష్టించి విక్రయించాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇంటి స్థలాలను ఏరియాను బట్టి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు విక్రయించారు. ఈ తతంగం దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రెవెన్యూ, పోలీసులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పలువురి లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిన స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తే వారు సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. సెటిల్‌మెంట్లు చేసుకోకుంటే దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి.

తహసీల్దార్‌ కార్యాలయం కాలిపోవడంతో..

నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద ఉండే సౌత్‌ తహసీల్దార్‌ ఆఫీస్‌ కాలిపోవడంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారికి అడ్డూ లేకుండా పోయింది. ఆ సమయంలో రికార్డులు, ప్లాట్లు పంపిణీ చేసిన లబ్ధిదారులు వివరాలు కాలిపోయాయి. దీంతో రెవెన్యూ అధికారులు ప్లాట్ల కబ్జాపై ఎవరైనా ఆశ్రయిస్తే రికార్డులు కాలిపోవడంతో వివరాలు లేవని చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. అయినా అక్కడి నుంచి సమాచారం తెప్పించుకోకుండా అక్రమార్కులు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి విక్రయిస్తున్నారు. ఈ ముఠాల వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులకు ఫిర్యాదు చేసినా!

ఇంటి స్థలాలు ఆక్రమించారని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు రెవెన్యూ అధికారులకు లెటర్‌ పెడుతున్నారు. దీంతో దీంతో రెవెన్యూ అధికారులు దీ నికి సంబంధించిన వివరాలు లేవని మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు లెటర్‌ పెట్టగానే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి రెవెన్యూ, పోలీసులను మేనేజ్‌ చేస్తున్నారు. లబ్ధిదారులను ముఠా సభ్యులు బెదిరించడంతో చాలా మంది ఇంటి స్థలాలను వదిలేసుకు న్నాడు. కాగా ఈ ముఠా సభ్యులు అధికారులను మె నేజ్‌ చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఓ పోలీస్‌ అధి కారి జన్మదిన వేడుకలను ఈ ముఠా సభ్యులు నిర్మ ల్‌ జిల్లాలో ఘనంగా జరిపినట్లు ప్రచారం ఉంది.

నాగారంలో పలు వివాదాలు

నకిలీ పట్టాలు సృష్టించి..

ప్రభుత్వ భూములను ఆక్రమించి నకిలీ పట్టాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. నకిలీ పట్టాల కోసం గతంలో ఉన్న రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించారు. వాటికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ఇంటి నంబర్లు కూడా తీసుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వ భూములు అధికంగా

ఉండటంతో కబ్జాదారుల కన్ను

పోలీసు, రెవెన్యూ అధికారులతో

కుమ్మకై ్క ఆక్రమణలు

నకిలీ పట్టాల విషయంలో ఇప్పటికే

రెండు కేసులు నమోదు

నాగారంలోని తన ఇంటి స్థలాన్ని ఆక్రమించారని మేయర్‌ భర్త శేఖర్‌పై సోమవారం రసూల్‌ అనే వ్యక్తి దాడి చేశాడు.

ఇటీవల నాగారంలోని భారతీరాణి కాలనీలో గల బొందెం చెరువు శిఖం భూమిని ముఠా సభ్యులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఫిర్యా దులు రావడంతో పోలీసుల బందోబస్తుతో శిఖం భూమిలో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఇందులో 11 మందిపై కేసు నమోదు అయింది.

ఏడాదిన్నర క్రితం అక్రమ పట్టాలపై అప్పటి సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.

రెండేళ్ల క్రితం సాయినగర్‌లోని ఓ స్థల వివాదంలో అప్పటి అధికార పార్టీకి చెందిన నేతలు దాడికి పాల్పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement