రైతుల్లో బోనస్ సంబరం
డొంకేశ్వర్(ఆర్మూర్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని నెర వేరుస్తోంది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున సన్న వడ్లకు బోనస్ అందజేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నా యి. సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు రావడంతో ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ వాట్సప్ స్టేటస్‌లు పెడుతున్నారు. ఈ మేరకు జిల్లాలో 3,223 మంది రైతులు లబ్ధి పొందగా, వీరికి రూ.12.54 కోట్లు విడుదలయ్యాయి. దీంతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతులు మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మూడు నెలల క్రితం రుణమాఫీ, ఇప్పుడు బోనస్ అందజేయడంతో కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. ఖరీఫ్ సీజన్‌లో రైతులంతా సన్నాలే సాగు చేయడంతో 80 శాతం మంది బోనస్‌ను అందుకోనున్నారు. ఇటు పంటను విక్రయించిన డబ్బులతో పాటు బోనస్ రావడంతో ఆదాయం రెట్టింపయ్యిందని రైతులు అంటున్నారు. ఇటు పొలాలు కౌలుకు తీసుకున్న రైతులకు కూడా లాభం జరిగింది.
బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సర్కారు
జిల్లాలో 3,223 మందికి లబ్ధి
సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు
Comments
Please login to add a commentAdd a comment