విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించాలి
కమ్మర్‌పల్లి: ఉపాధ్యాయులు బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి విద్యార్థులను ఆక ట్టుకునేలా పాఠాలు చెప్పాలని డీఈవో అశో క్ సూచించారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను డీఈవో సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సూచనలు చేశారు. విద్యార్థులను నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(న్యాస్)కు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాల ని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కమ్మర్‌పల్లిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి ప్రత్యేకాధికారి గంగమణితో మాట్లాడారు. ఎంఈవో ఆంధ్రయ్య, హెచ్‌ఎంలు రాజన్న, గిరిధర్ పాల్గొన్నారు.
సీడీఎంఏకు మున్సిపల్ మేనేజర్ సరెండర్
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న హయ్యుమ్‌ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజు సీడీఎంఏ కార్యాలయానికి సరెండర్ చేశారు. గురువారం మున్సిపల్ కార్యా లయంలో మున్సిపల్ కమిషనర్, మేనేజర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఓ కౌన్సిలర్ జోక్యం చేసుకొని ఇరువురిని సముదాయించారు. పై అధికారితో అనుచితంగా ప్రవర్తించడంతో సీడీఎంఏకు సరెండర్ చేశానాని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
డాటా ఎంట్రీ సక్రమంగా చేపట్టాలి
నందిపేట్: ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయంలో డాటా ఎంట్రీ చేపడుతున్న తీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ, అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ సందర్భంగా సూచించిన అంశాలను తప్పకుండా పాటించాలన్నారు. పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ ఆనంద్, ఎంపీడీవో శ్రీనివాసరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment