అట్టహాసంగా పాసింగ్ అవుట్ పరేడ్
ఎడపల్లి: ఎడపల్లి మండలంలోని జాన్కంపేట వద్ద గల కమిషనరేట్ ట్రెయినింగ్ సెంటర్ (సీటీసీ)లో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకన్న కానిస్టేబుళ్లు ఆయనకు గౌరవ వందనం చేశారు. శిక్షణ సమయంలో ఐదు ఈవెంట్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురికి డీజీ మెడల్స్ అందించారు. ఆల్‌రౌండర్‌గా హర్షవర్ధన్, బెస్ట్‌పరేడ్ కమాండర్‌గా జె వాసు, బెస్ట్ ఫైరింగ్ క్రాంతికుమార్, బెస్ట్ ఇండోర్‌గా రాజ్‌కుమార్, బెస్ట్ అవుట్ డోర్ నరేష్‌కు మెడల్స్ అందజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 250 ఏఆర్ కానిస్టేబుళ్లుగా ఇక్కడ శిక్షణ పొందారు. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు హాజరు కావడంతో సీటీసీ ప్రాంగణం సందడిగా మారింది.
కవాతు చేస్తున్న కానిస్టేబుళ్లు
శిక్షణ పూర్తిచేసుకున్న సోదరులు
రంగారెడ్డి జిల్లా తలక్కొండ మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్, శివకుమార్ అన్నదమ్ములు ఒకేసారి కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసి వీరిని చదివించారు. రాఘవేందర్ ఎం ఫార్మసీ, శివకుమార్ బీటెక్ పూర్తి చేశారు. రాఘవేందర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రిపేర్ కాగా శివకుమార్ కరోనా సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోవడంతో కానిస్టేబుల్‌కు ప్రిపేర్ అయ్యారు. ఇద్దరు ఒకేసారి కొలువు సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment