నిజామాబాద్
● ఆనందం
● వందనం
దేశంలోనే తెలంగాణ
క్రీడల్లో ప్రతిభ
జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
వాతావరణం
ఉదయం చలిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లో u
ఎడపల్లి(బోధన్): దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ స్థానంలో ఉందని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని సీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ ప్రోగాంకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 16 శిక్షణ కేంద్రాల నుంచి 8149 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఇంటర్నేషనల్, నేషనల్ ఐ టీ, ఫార్మసీ కంపెనీలు ఉన్నాయని, అక్కడ పని చేసే సిబ్బందికి ఒత్తిడులు వస్తాయని, వాటిని అధికమించి ముందుకు సాగాలన్నారు. డ్యూటీని నిబద్ధతో చేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడటమే కాకుండా ప్ర జల ఆస్తులను రక్షించాల్సి ఉంటుందన్నారు. పోలీసులకు ఒకే డ్యూటీ ఉండదని అన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుందన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారికి పోలీసు శాఖలో గుర్తింపు లభిస్తుందన్నారు. అడ్డదారులు తొక్కకుండా సక్రమంగా పని చేసి తెలంగాణ పోలీసులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. విధులతోపాటు తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసు అంటే వయోలెన్స్ చేసే వారికి వర్తించదని, సామాన్య ప్రజలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. శిక్షణ తీసుకున్న కానిస్టేబుళ్లలో 80 శాతం మంది గ్రాడ్యుయేట్లు, 20 శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారన్నారు. వీరు రాబోయే రోజులలో ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలకు వెళ్లిన తర్వాత రిపోర్టు చేసి వారికి కేటాయించిన స్థానాలలో సత్తప్రవర్తనతో పని చేస్తూ రాష్ట్రాన్నికి మంచిపేరు తీసుకురావాలన్నారు.ఇన్‌చార్జి పోలీసు కమిషన్ సింధుశర్మ పాల్గొన్నారు. అనంతరం డైరెక్టర్ జనరల్ శిక్షణపూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురికి మెడల్స్ అందించారు. సీటీసీలో సైబరాబాద్ పో లీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 250 ఏఆర్ కానిస్టేబుళ్లుగా ఽశిక్షణ పొందారు. కార్య క్రమంలో ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ పాల్గొన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. సెల్ఫీలు తీసుకున్నారు.
ఆశీర్వాదం
న్యూస్‌రీల్
పోలీస్ నంబర్ వన్
రాష్ట్ర వ్యాప్తంగా 8,149 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి
పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన
ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment