ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
బోధన్: ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా సహకార అధికారి (డీసీవో) శ్రీనివాస్ అన్నారు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, సీఈవో బస్వంత్‌రావులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డీసీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డబ్బులు రైతులకు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని, ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా జమ చేస్తున్నామని వెల్లడించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీసీవోను సొసైటీ చైర్మన్, మాజీ చైర్మన్ శివకాంత్ పటేల్, సీఈవోలు సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment