చికిత్స పొందుతూ ఒకరి మృతి
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన మేడుదుల రాజు (35) కలెక్టరేట్‌లోని మైనింగ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ నెల 20న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే అడ్డుగా వచ్చిన పందిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి పడిపోయాడు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కాగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్సై బి రాజు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment