నందిపేట్: నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గోదావరి నది బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి ఆయనను కాపాడారు. వివరాలు.. నందిపేట మండలం చింరాజ్పల్లి గ్రామానికి చెందిన కొమ్ము రాములుకు తన సోదరులతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం సాయంత్రం బైక్పై ఉమ్మెడ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. బైక్ను ఆపి ఫోన్ను అందులో పెట్టి గోదావరిలో దూకాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. వరద ఉధృతికి కొట్టుకుపోతూ బ్రిడ్డి కింద పిల్లరును పట్టుకుని ఉన్నాడు. సుమారు గంట తర్వాత స్థానికులు వేసిన తాడును పట్టుకుని బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చేలోపు రాములు నది నుంచి బయటకు వచ్చేశాడు. అయితే ఇటీవల ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఆత్మహత్య ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో వంతెనపై పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment