ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
డొంకేశ్వర్/నందిపేట: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. డొంకేశ్వర్, నందిపేటలో కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. కాంటా వేసే సమయంలో ఎంత ధాన్యం తూకం వేస్తున్నారు, మిల్లులకు తరలిస్తే తరుగు తీస్తున్నారా అని రైతులను అడిగారు. జిల్లాలో 670 పైచిలుకు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3.5క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం వరకు కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ధా న్యం రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, లోడింగ్ అన్ లోడింగ్ సజావుగానే జరుగుతోందన్నారు. కేంద్రాల రైతులు నిరీక్షించకుండా క్రమ పద్దతిలో ధాన్యం బస్తాలను తూకం జరిపించాలని, వెంటవెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సన్న ధాన్యానికి సంబంధించి సంపూర్ణ వంటి రకాలను సైతం మండల వ్యవసాయాధికారి ధృవీకరణతో ఫైన్ వైరటీ కింద కొనుగోలు చేయవచ్చని తెలిపారు. సన్నాలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు నరేశ్, ఆనంద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్లు భరత్‌రాజ్ రెడ్డి, మీసాల సుదర్శన్, నాయకులు గొడిశరం భూమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment