విత్తన ఎంపికలో జాగ్రత్తలు
బాన్సువాడ: వానాకాలం పంట పూర్తి కావడంతో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. కొన్ని చోట్ల నార్లు పోస్తున్నారు. గతేడాది బీర్కూర్ మండలంలో రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి నిలువున ముంచారు. దీంతో విత్తన ఎంపికలో జా గ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
● రైతులు విత్తన కొనుగోలు సమయంలో ఒప్పంద పత్రాన్ని తీసుకోవాలి.
● విత్తనం తీసుకునేటప్పుడు గుర్తింపున్న కంపెనీయా కాదా చూడాలి.
● ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాన్ని ఎంచుకోవాలి.
● కంపెనీలిచ్చే విత్తన వివరాలు, రశీదులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
● డీలర్లు ఆయా ప్రాంతాలకు అనువైన విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలి.
● విత్తనాలు మొలకెత్తకపోతే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
బీర్కూర్‌లో నారుమడి
Comments
Please login to add a commentAdd a comment