వీరంతా ఎవరి తాలూకా..?
రోడ్డు రవాణా నిబంధనలను తుంగలో తొక్కుతూ ‘మేం ఫలానా వారి తాలూకా..’ అంటూ ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారంతా ‘ఎవరి తాలూకా..?’ అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ద్విచక్ర వాహనాల కారణంగా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎవరికి చెప్పుకోవాలి? బాధ్యులను ఎలా గుర్తించాలని ప్రశ్నిస్తున్నారు. పలు ద్విచక్రవాహనదారులు ఇలా తమ వాహనాల నంబర్ప్లేట్లపై ఇష్టారీతిన స్టిక్కర్లు అతికించి నడుపుతున్న దృశ్యాలు ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment