డెయిరీ కళాశాలలో జాతీయ పాల దినోత్సవం
కామారెడ్డి అర్బన్: జాతీయ పాల దినోత్సవం సందర్భంగా స్థానిక డెయిరీ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం వర్గీస్ కురియన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అధిక పాల ఉత్పత్తికి కారకులైన శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతిని జాతీయ పాల దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయమని కళాశాల అసోసియేట్ డీనన్ కేఎస్ ఉమాపతి అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన కామారెడ్డి ఎంపీడీవో కె.నాగవర్ధన్ మాట్లాడుతూ..వర్గీస్ కురియన్‌ను ఆద ర్శంగా తీసుకొని డెయిరీ విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. అధ్యాపకులు మాధవి, శైలజ, శ్రీనివాస్, సురేందర్,స్వాతి, శరత్‌కుమార్ పాల్గొన్నారు.
దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి
ఖలీల్‌వాడి: నిజామాబాద్ న్యాయవాది ఖాసీంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌మోహన్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అత్యవసరంగా సమావేశమైన న్యాయవాదులు ఖాసీంపై దాడి ఘటనపై చర్చించి విధులను బహిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. న్యాయవాది ఖాసీంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, రిమాండ్ చేయలన్నారు. అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి జిల్లా కోర్టు వద్దకు వచ్చి న్యాయవాదులతో మాట్లాడారు. దాడి కేసులో హ త్యాయత్నం సెక్షన్ అల్ట్రేషన్ చేసి కోర్టులో మెమో దాఖలు చేశామని, అరెస్ట్‌కు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ మెంబర్ రాజేందర్‌రెడ్డి, వసంతరావు, రాజు, సురేశ్, పిల్లి శ్రీకాంత్, ఆయూబ్, శ్రీధ ర్, భాస్కర్, పి వెంకటేశ్, మాణిక్, ఆశ నారాయణ, రాజు, రవీందర్, విఘ్నేశ్, జైపాల్, జునైద్, ఇర్ఫాన్, జిషంత్, ఇంతియాజ్, ఖలీద్, కవితారెడ్డి, అంజలి, కావ్య, అఖిల, ప్రవీణ, నూర్జహాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment