రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ దీక్ష చేశారు
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీక్ష దివస్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్షతో విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. కేసీఆర్ దీక్షకు ఇంత ప్రాధాన్యత ఉన్నకారణంగానే గత 15 సంవత్సరాలుగా నవంబర్ 29ని దీక్ష దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటులో చోటుచేసుకున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈనెల 29న దీక్ష దివస్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ ఆదేశించిందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 500మంది తరలిరావాలని కోరారు. పైరవీ కారులు, కాంట్రాక్టర్లు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు ఎటువంటి నష్టం లేదన్నా రు. కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో కొట్టే పరిస్థితి ఉందన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని, భవిష్యత్ లో మీరే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ టీసీలుగా పని చేసే అవకాశం ఉందన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. దీక్ష దివాస్‌ను విజయవంతం చేయాలన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాడి పంటలతో కళకళలాడిన తెలంగాణ గడ్డ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, తనను సైతం వేధిస్తున్నారని అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. దీక్ష దివస్ జిల్లా ఇన్‌చార్జి ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అరాచకాలు పెరిగాయన్నారు. దీక్షా దివస్ స్పూర్తితో పోరాడుదామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, సీనియర్ నాయకులు రాజారాంయాదవ్, రాంకిషన్‌రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దీక్ష దివస్‌కు నాయకులు,
కార్యకర్తలు తరలిరావాలి
చురుగ్గా పని చేయండి.. భవిష్యత్ స్థానిక ప్రజాప్రతినిధులు మీరే..
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment