‘పారదర్శకంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు’
ఆర్మూర్ గురుకులం క్రీడాకారులు..
మద్నూర్(జుక్కల్): ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు వ్యవస్థపై నమ్మకంతో ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ మాట్లాడారు. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టేసిందన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నించే వారి అస్థిరతను ఎత్తిచూపిందని తెలిపారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ ముజీబ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment