భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
ధర్పల్లి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. మంగళవారం ధ ర్పల్లిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు కోసం వండిన భోజనా న్ని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహా లు, పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం, అల్పాహా రం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వండడానికి ముందే ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ సూ చించారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు వంతుల వా రీగా ఆహార పదార్థాలు నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలన్నారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెంట నే తహసీల్దారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
99 శాతం సర్వే పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే జిల్లాలో 99 శాతం పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వేగవంతంగా నమోదు చేస్తున్నామన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను ఆయన తని ఖీ చేశారు. ఈనెల 30లోపు ఆన్‌లైన్‌లో నమోదు ప్ర క్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ధర్పల్లి మండలం రామడుగులో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు చేసిన ధా న్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఇప్పటికే విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పా టు, బోనస్ డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధా న్యం సేకరణ పూర్తయిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలన్నారు. ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎంపీడీవో బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment