తెయూలో మరో గర్ల్స్ హాస్టల్
తెయూ క్యాంపస్‌లో ప్రస్తుతం ఉన్న బాలికల హాస్టల్
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో ఎ న్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండవ బాలికల (గర్ల్స్) హాస్టల్ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం ల భించింది. ఇటీవలే టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో టెండర్ ఖరారుకాగా, కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు.
తెయూ మెయిన్ క్యాంపస్ లో 2008–09 లో గర్ల్స్ హాస్టల్ ప్రారంభించారు. ప్రతి యేటా పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, ఎల్‌ఎల్‌బీ కోర్సులలో బాలుర కంటే బాలికల ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. బాలురకు రెండు హాస్టల్స్ ఉండగా బాలికలకు మా త్రం ఒకటే హాస్టల్ ఉంది. దీంతో ఉన్న ఒక్క హాస్టల్‌లో బాలికలు కిక్కిరిసి తలదాచుకోవాల్సి వస్తోంది. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు ఉండాల్సి ఉండ గా గదులు సరిపోక ఆరుగురి నుంచి ఎనిమిది మంది ఉంటున్నారు. దీంతో బాలికలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా రెండవ గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు హాస్టల్ నిర్మాణానికి టెండర్ ఖరారు కావడంతో యూనివర్సిటీలోని బాలికలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూసా నిధులు
రూ.7 కోట్లతో నిర్మాణం
వారం రోజుల్లో పనులు ప్రారంభం..
ప్రస్తుతం ఒకే హాస్టల్.. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న బాలికలు
Comments
Please login to add a commentAdd a comment