బడాపహాడ్ ఉర్సు ప్రారంభం
వర్ని: వర్ని మండలంలోని బడాపహాడ్ ఉర్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. మండలంలోని జలాల్పూర్‌లో దర్గా పూజారుల ఇంటి నుంచి ఉర్సు నైవేద్యాన్ని తీసుకువచ్చి గ్రామ చావిడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కవ్వాలి ఇతర సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ప్రార్థనలు నిర్వహించి షాదుల్లా బాబాకు సమర్పించే నైవేద్యాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తలపై పెట్టుకుని ఉర్సు ప్రారంభించారు. ఉర్సు గంధాన్ని (నైవేద్యం) ఒంటె, గుర్రంపై ఉంచి జలాల్పూర్ నుంచి బడాపహాడ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం బడా పహాడ్ దర్గాపై ఉన్న శాదుల్లా బాబాకు సమర్పించారు. సోమవారం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కాగా తొలిరోజు ఆశించిన స్థాయిలో భక్తులు రాలేదు. ఇటీవల దర్గా వద్ద పూజారుల దోపిడీ, కనీస సౌకర్యాలు లేకపోవడంతో బడాపహాడ్‌కు భక్తులు రావడానికి మొగ్గు చూపడం లేదు. ఉత్సవాల సందర్భంగా గుట్ట వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్ బోర్డు విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment